Friday, January 16, 2015

ఎందుకు?

Wrote on :  10-01-1984

ఎందుకు?

ఈ ఎందుకు అనే ప్రశ్న మనకి జీవితంలో చాలా సార్లు మనకి మనమే వేసుకొనేది.

People purpose of Life with Vision & mission


నేను నా పేరు, నా ఊరు
అనుకోని పొంగి పోతవెందుకు ?

గొప్పవాళ్ళని గోడు వింటారని
వంగి వంగి దండలు పెడుతారు ఎందుకు?

గప్పు చేసిన వాళ్ళు తన వాళ్ళు
కాదని లోకం చూ స్తుందని ఎందుకు?

చేపలు ఈదుతాయి, పిట్టలు
ఎగురుతాయి, ఎందుకు?

ఇల్లు ముంగిళ్ళు బంగారం సింగారం
ఉంటేనే సంతోషం ఎందుకు?

సింగారించిన బంగారం మంగళకరమై
లేకుంటే దుఖం  ఎందుకు?

అన్ని విధాల ఉన్న ఆశలకు
అంతులేదు శాంతి లేదు ఎందుకు?

సాహసం ఊపిరి అయితే ఆగిపోవడం ఎందుకు ?
ఆపడం ఎందుకు ?

సాగిపోతూఉంటే ఆపుతుంది సమాజం...
ఆగిపోతే అడుగుతుంది కారణం అదే సమాజం.. ఎందుకు ?

బ్రతకనేర్చిన వాళ్లు వేస్తారు ప్రణాళికలు... మరి ఎందుకు? ఆలస్యం ఆచరణకు...
ఆచరిస్తే కదా విజయం.. సప్త సముద్రాలను దాటినట్టు..

మంచు పర్వతం ఎక్కునట్టు..
మరి జాప్యం ఎందుకు?

వేసుకో ప్రణాళిక... తీసుకో సమయం...
ఆపివేసి ఒకరిపై ఆధారపడడం.. సిద్ధం చేయి విజయ వేదిక..

ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి... సముద్రం లో నీటిబొట్టులా...
ఎడారి లో ఇసుకరేణువుల్లా

మీకు ఇటువంటి ప్రశ్న ఉంటె  కామేంట్ వ్రాయండి 

కమలం - ఒక పువ్వు

కమలం  - ఒక పువ్వు


కదిలిస్తే కన్నీటి సముద్రం కమలమ్మ మా ఇంటి ఆడపడుచు, అనవసరంగా చక్కని జీవితాన్ని ఒంటరి తనంతో గడిపి ఎన్ని భాదలో అనుభవించింది.  అక్క,అన్నల కుటుంబాలకు సేవచేస్తూ కాలం గడిపింది , చూడచక్కని మోముతో కనిపించే ఆమె మూగ రోదనలకి ఈ కవిత అద్దం పడుతోంది, గుండె లోతుల్లో పొంగిన @దుఖః న్ని అక్షర రూపంలో పెడితే జాలువారిన కవిత

In rememberance of Kamalamma Devarakonda 


నీ కోరికలే  లోకమా ,!
లోకం విడిచి పొతే కోరికలు తీరెనా?
మనసులోనంత మలిన భావనలతో నింపకు 
అసలు పుట్టిన దెందుకో కనుక్కో!

ప్రకృతిలోని కమలమా!
పూసి వికసించి వాడిపోయె చిహ్నమా!
బొంతలాంటి చింతలేల?
నీ బ్రతుకంతా?ఎదురుచూపేనా?

హృదయ కమలమ!
నిన్నెవరు కోరుకోన్నవారు లేరని 
చింతించి చితికి పోకుమా!
పూసిన కమలమే పుణ్యమైనదన!

ఎవరడికి దక్కినా దక్కకకున్న 
కమలం కమలానివేకదా !
దండలో చేరి దేవునికి దండైనా 
కాలగమనం లో రాలునదేకదా !

Thursday, January 15, 2015

మంచి మాట

మంచి మాట


ఎక్కువా అని మొక్కకుతక్కువా అని తొక్కకు!!

భక్తి: బ్రతుకు బరువు దైవానుగ్రహం


జీవమ్


నా బ్రతుకు బరువు దైవానుగ్రహం!
నా ప్రతి అడుగు నీ ప్రదక్షణం
నేను చూసే ప్రతి చైతన్య రూపం
దైవంగానున్న విశ్వరూపం

నెను తినే ప్రతి బండారం
దైవమొసంగిన పవిత్ర ప్రసాదం

మందహాసిత మదుర క్షణం
మనుసున పూచే మనొహర కుసుమలు

ఇస్టాలు కష్టాలు ఎన్నిఉన్నా

మనొభావలను మర్చె అనుభవాలు!

భక్తిమార్గం

భగవంతుని మనసులో నింపుకొని ఆలోచించగా మదిలో మేదిలినది ఈ భక్తికవిత 
నీవుండేదా కొండ పయ్యా?
నేనేల నమ్మనయ్యా!!

కాళ్ళు, కళ్ళులేని వారికి ఏలనయ్యా
జీవ సంరక్షకా! అనంత రూపా!

సృష్టి కర్తా సుజన కీర్తా
భవ భయ హరణా భక్తజనపాల!

సర్వంతర్యామి! సర్వెశా!

దయ చూడవే దయా నిధి!

27-March-1967

లేదు : నీకు మించిన నేను లేదు

10-12-1984

The thoughts that I got on everyone life and it is given a momentum to write a poem in Telugu. Confidence about yourself. Controlling yourself from anger and jealous and many other sins that we do knowing or unknowing.


నీకు మించిన నేను లేదు
కోపానికి మించిన పాపం లేదు

మనసుకు మించిన మమకారం లేదు
మానవత్వానికి మించిన మంచితనం లేదు

అసుయకు మించిన దుర్గుణం లేదు
నమ్మకానికి మించిన వింతైన ప్రేమ లేదు

ఏకాంటానికి మించిన ప్రశాంతత లేదు
ప్రకృతికి మించిన పుస్తకం లేదు

భావనలకు మించిన భవిష్యత్తు లేదు
మాటకు మించిన మనుగడ లేదు

ఇవి తెలియవని చెప్పుట లేదు
నాకు తెలిసినవి కొన్ని ... మరుచుట లేదు


Wednesday, January 14, 2015

అచ్చుల్లొ కవిత: అ - అః

1983 సంవత్సారం లో రెయిన్ బజార్ నందు ఉన్న వీర హనుమాన్ దేవాలయంలో పిల్లలకు అ -ఆ లు నెర్పుటప్పుదు మెదిలిన కవిత ఇది. దీనిలో ఎందరో జీవితలను దెగ్గరగా పరిశిలించి  సారాన్ని సారాంశంగా తీసుకొని ఒక్క అచ్చుకి పొదవి పట్టి అందించినదే అచ్చులతో సమ్మేళనం చేసిన కవిత.

తెలుగు అక్షరాల్లో మొదటి 16 అక్షరాలని ప్రాణఅక్షరాలంటారు. ఈ అక్షరాలతో ఒక ప్రాణికి ఏం అవసరమో, ఎటువంటి అనుభవాలు ఎదురైతాయో, దేనికి సిద్దంగా ఉండాలో, ఎన్నో నిజాలు, మరెన్నో అనుభవాలు, ఏ విధానాన్ని అలవార్చుకోవలో, ఎలాంటివి మార్చుకోవాల్సిన అలవాట్లను, , ఆచరణలో ఉంచాలో, కనిపెట్టి కలగలిపి వడ్డించినదే ఈ కవిత.



Telugu Vowels - Achullo Kavitha



అ - అడుగడుగున క్రొత్త అటు తరువాత పాత!!
ఆ - ఆశలు అనువనువున - ఆడుకుంటాయి
ఇ - ఇష్టాలకు కష్టాలు పుడుతాయి, ఇంతేకదు?
ఈ - ఈ జీవితం ఎందుకని? ఆలొచింప చేస్తాయి!
ఉ - ఉన్న కాలన్ని  ఉపయొగించుకొ ఉచితంకదా!
ఊ - ఊరిలొ నీ పేరు గాలికి పొకుండా చూసుకొవాలి!
ఋ - ఋషులు అయినా సాధనలు చేయాక తప్పదు!
ౠ - ౠపాయి విలువ తెలిసికొని, అవసరాలని తీర్చుకోవాలి!
ఎ - ఎంతకని చూస్తాం? ఏదైన కొంతకాలమేగా!
ఏ - ఏది ఏమైనా బ్రతుకు ఒక వరం!
ఐ - ఐదు దశాబ్దలు గడిస్తే చాలు ఇరవై పెరుగుటకు పొగా!
ఒ - ఒరిగేది తృప్తి, మనిషిననే జ్ఞప్తి!
ఓ - ఓర్పు, నేర్పు యుండాలి ఓడినా, గెలిచినా!
ఔ - ఔచిత్య గుణం ఔన్నత్యానికి మార్గం!
అం - అంతా మాయ ఎంతలొ ఎన్ని వింతలొ..
అః - అః!! ఇంతేలే ఈ లోకం తీరు! 

చదవండి చదివించండి మన తెలుగు కవితల ఈ బ్లాగ్ పోస్ట్ ని